Natu Natu Song : సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదల చేసిన నాటు నాటు సాంగ్‌కు ఆలిండియా లెవల్‌లో విపరీతమైన స్పందన లభిస్తోంది. ఎంతగా అంటే.. అభిమానులు ఈ సాంగ్‌కు తమ సొంత శైలిలో స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు.
నాటు నాటు సాంగ్ మాస్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లిందని చెప్పవచ్చు. విడుదలై 12 రోజులు అయ్యే సరికి 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది కేవలం తెలుగు వెర్షన్‌కు మాత్రమే. మిగిలిన భాషలను కూడా కలిపితే వ్యూస్ ఇంకా ఎక్కువే ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పాటలో ఎన్‌టీఆర్, చరణ్‌లు వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
సహజంగానే ఈ ఇద్దరూ డ్యాన్స్ బాగా చేస్తారు. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేములో కనిపించడం.. అదీ.. ఇలా డ్యాన్స్ చేయడం.. అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ పాటకు స్టెప్పులు వేయడం కోసం చరణ్, తారక్‌లు ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. ఇద్దరూ పర్‌ఫెక్ట్ సింక్‌లో డ్యాన్స్ చేసేందుకు గాను ఈ సాంగ్‌కు ఒక్కో సారి 15 నుంచి 18 టేక్స్ కొన్ని సీన్లకు తీసుకోవాల్సి వచ్చిందని తారక్ తెలిపాడు.
ఈ పాటను షూట్ చేస్తున్నప్పుడు దర్శకుడు రాజమౌళి ప్రతి స్టెప్‌ను నిశితంగా పరిశీలించారని.. తమను ఇబ్బందులు పెట్టినా.. చివరకు వచ్చిన ఔట్‌పుట్‌ను, ప్రేక్షకుల స్పందనను చూస్తుంటే.. తాము పడ్డ కష్టం అంతా మరిచిపోయామని.. ఎన్‌టీఆర్ తెలిపారు.
చాలా మంది ఈ పాటను చూసి ఇద్దరూ కలసి అంత పర్‌ఫెక్ట్ సింక్‌లో ఎలా డ్యాన్స్ చేశారని.. అడుగుతున్నారని.. అయితే ఇదంతా దర్శకుడు రాజమౌళి చలవేనని ఎన్‌టీఆర్ అన్నారు. ఈ మేరకు తారక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…