Republic Movie : సాయిధరమ్ తేజ్ హీరోగా.. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన సెలబ్రిటీలు ఈ సినిమా గురించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమాను నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ హరీష్ శంకర్ చూసి ఈ సినిమా పై ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా నాని ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. రిపబ్లిక్ సినిమా చూశాను.. తేజు తన చుట్టూ ఉండే వారందరిపై చూపించే ప్రేమ, ఆప్యాయతలు తిరిగి మీ ప్రార్ధన రూపంలో అతనికి చేరుతున్నాయి. సాయి తేజ్ ఎంత బలంగా మన ముందుకు రాబోతున్నాడో తెలియజెప్పే చిత్రమే రిపబ్లిక్.. అంటూ నాని ట్వీట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్.. అంటూ దేవకట్టా బలంగా అనౌన్స్ చేసిన చిత్రం ఇది. ఈ చిత్ర బృందానికి కంగ్రాట్స్.. అంటూ నాని ట్వీట్ చేశారు.
https://twitter.com/harish2you/status/1443635297342787592
Watched Republic.
For all the kindness @IamSaiDharamTej has shown towards everyone around him it has come back in the form of your prayers and it’s coming back stronger in the form of #REPUBLIC. This is @devakatta ‘s announcement that he is back. Congratulations to the team 🤗— Nani (@NameisNani) September 30, 2021
ఇక ఈ సినిమా గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమా ఇప్పుడే చూశాను.. సాయి తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా.. అంటూ తెలిపారు. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్య కృష్ణ, ఐశ్వర్య రాజేష్ తమ పాత్రల్లో జీవించారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.. అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ రిపబ్లిక్ సినిమా గురించి ట్వీట్ చేశారు.