Nandita Swetha : హీరోయిన్స్‌కు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సంఘటన ఎదురవుతూనే ఉంటుంది. కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో వారిని దూషిస్తుంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్ నందిత శ్వేతకు కూడా తాజాగా ఓ ఘోరమైన అవమానం జరిగింది. ఆమెను ఉద్దేశించి ఓ నెటిజన్ అసభ్య పదజాలంతో కామెంట్లు చేశాడు.

అందరు హీరోయిన్స్ లాగే నందిత శ్వేత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె గోడకు ఆనుకుని నిలబడి ఉన్న ఫొటో ఉంది. అయితే చాలా మంది ఆ ఫొటో పట్ల పాజిటివ్‌గానే స్సందించారు. చాలా బాగున్నావు.. అంటూ ఆమెకు కితాబిచ్చారు. కానీ కొందరు మాత్రం తమ నోళ్లకు పనిచెప్పారు.
నందిత శ్వేత ఫొటోను ఉద్దేశించి ఓ నెటిజన్ అసభ్యకరమైన రీతిలో కామెంట్ చేశాడు. నీ బాడీ షేప్స్ ఒకసారి చూసుకో.. ఆంటీలా మారిపోతున్నావ్.. కొంచెం వర్కౌట్స్ చేయి.. అంటూ ఓ నెటిజన్ దారుణమైన కామెంట్స్ చేశాడు. అయితే అతడు చేసిన కామెంట్స్ కి నందిత శ్వేత కాస్త ఎమోషనల్ అయింది. అయినప్పటికీ ఆమె అతడికి దీటుగా బదులు చెప్పింది.
ఇలాంటి వారితో నరకం అనిపిస్తుంది. నేను కూడా మనిషినే.. నాకూ ఇబ్బందులు ఉంటాయి. నేను దేవతని కాదు కదా. కానీ ఇలా మనసుని బాధపెట్టే విధంగా ఎలా కామెంట్స్ చేస్తారు. నా బాడీని, నేనిప్పుడు కనిపిస్తున్న విధానాన్ని ఇష్టపడతాను. నా లైఫ్ లో ఈ దశని ఎంజాయ్ చేస్తున్నాను.. అంటూ అతడికి నందిత అదిరిపోయే రిప్లై ఇచ్చింది. దీంతో ఈ విషయంలో నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇక నందిత శ్వేత పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలు చేసింది. ముఖ్యంగా నిఖిల్‌తో కలిసి ఈమె చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా.. ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే శ్రీనివాస కల్యాణం, ప్రేమ కథా చిత్రం, కపటధారి, అక్షర చిత్రాల్లోనూ ఈమె నటించింది. ప్రస్తుతం నందిత ఢీ 14 షోలో జానీ మాస్టర్‌తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తోంది.