ఈ మధ్య కాలంలో ఏదైనా అగ్ర హీరో మూవీ విడుదల అవ్వగానే, ఆ హీరో ఇంకా ఇతర అగ్ర హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధాలను తరచూ మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్ వార్స్ కూడా సాధారణం అయిపోతున్నాయి. ఒక హీరో అభిమానులు ఇంకో హీరోని తిట్టడం, హద్దులు మీరి ప్రవర్తించడం మామూలు విషయంలా అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ అభిమానం బింబిసార మూవీకి తల నొప్పిగా మారిందని తెలుస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో దాదాపు 2 సంవత్సరాల విరామం తరువాత విడుదలైన సినిమా బింబిసార. విడుదలైన రోజు నుంచే మంచి హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నందమూరి అభిమానులు బింబిసార మూవీని ఇటీవల చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పోలుస్తూ.. చిరంజీవి అసలైన మెగాస్టార్ కాదని, కళ్యాణ్ రామే అసలైన మెగాస్టార్ అని ఆయనని ఆకాశనికి ఎత్తేస్తున్నారు. ఇది ఇప్పుడు మెగాస్టార్ అభిమానులకి, ఇతర మూవీ లవర్స్ కి కోపం తెప్పించేలా ఉంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలుసు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇది కాదనలేని నిజం. సాధారణంగా మంచి సినిమాని ఇతర హీరోల అభిమానులు కూడా ఆదరిస్తారు. కానీ నందమూరి అభిమానులు ఇప్పుడు చేస్తున్న పనివల్ల ఈ మూవీకి నెగెటివ్ పబ్లిసిటీని తెచ్చిపెట్టడంతోపాటు.. ఇతర సినీ ప్రియులని ఎక్కడ థియేటర్లకి రాకుండా చేస్తుందోనని.. నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఈ వార్ మామూలే. దీని ఫలితం బింబిసార మూవీపై ఉండదనే చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…