Nagarjuna : ఏపీ సీఎం జగన్‌ని తెలుగు సినిమా నటుడు నాగార్జున కలవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌తో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. నాగార్జునతోపాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సినీ టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందుకనే హీరో నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు విజయవాడకు వెళ్లినట్టు టాక్. నాగార్జున – జగన్మోహన్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్ తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ వంటి అంశాలు చర్చకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ నుంచి ఏ సినీ పెద్దలు.. సినీ నటీనటులు లేరు.. కేవలం ఇద్దరు నిర్మాతలతో వెళ్లినందున ఇప్పుడు సీఎం జగన్ తో సమావేశం టాలీవుడ్ సమస్యలపైనా లేక వ్యక్తిగత విషయాలను చర్చించేందుకు వచ్చారా ? అనే విషయంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…