Jabardasth : బుల్లితెరపై అత్యంత సక్సెస్‌ఫుల్ గా కొనసాగిన షోలలో జబర్దస్త్ ఒకటి. కానీ ఇది గతం. ఇప్పుడు అందులో స్టార్ కమెడియన్లు లేరు. జడ్జిలు, యాంకర్లు.. ఎవరు ఉన్నా.. ఎవరు మారినా సరే.. షోకి కమెడియన్లే బలం. అందువల్ల వారు లేకపోతే షోను ఎవరూ చూడరు. ఇప్పటికే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటివారు ఈ షోకు గుడ్ బై చెప్పారు. వీరు ఇతర టీవీ చానల్స్ లో వస్తున్న షోలకు వెళ్లిపోయారు. జబర్దస్త్ కన్నా రెండు రెట్లు ఎక్కువ పారితోషికం ఇస్తుండడం వల్లే వీరు ఇతర చానల్స్‌కు మారినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కిరాక్ ఆర్‌పీ జబర్దస్త్, మల్లెమాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
జబర్దస్త్ నిర్వాహకులు అయిన మల్లెమాల వారు షో షూటింగ్‌ల సమయంలో తమను పట్టించుకోరని.. హీనంగా చూస్తారని.. కనీసం భోజనం కూడా సరిగ్గా పెట్టరని కిరాక్ ఆర్‌పీ సంచలన కామెంట్స్ చేశాడు. అయితే నాగబాబు మాత్రం దేవుడని అన్నాడు. ఆయన ఎన్నో సార్లు జబర్దస్త్ కమెడియన్లకు సహాయం చేశారని కొనియాడాడు. దీంతో అగ్గి రాజుకున్నట్లు అయింది. వెంటనే దీనికి హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఆర్‌పీ అన్నట్లుగా మల్లెమాల ఏమీ వ్యవహరించదని.. వాస్తవానికి మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి చాలా ఉదార స్వభావం కలిగి ఉన్నవారని.. ఆయనే తమకు సహాయం చేసేవారని.. అయితే ఆర్‌పీ అలా ఎందుకు మాట్లాడాడో తెలియదని.. ఆది, రామ్ ప్రసాద్‌లు చెప్పారు. దీంతో కిరాక్ ఆర్‌పీని తప్పుబట్టారు.
ఇన్ని రోజులూ మల్లెమాల సంస్థ తిండి తిని ఈ రోజు తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే పొడిచినట్లు ఆర్‌పీ ఆ సంస్థపై కామెంట్స్ చేయడం తగదని.. నెటిజన్లు అన్నారు. అయితే దీని వెనుక అంతా నాగబాబు ఉండి స్వయంగా ఆయనే ఇలా జబర్దస్త్‌పై, మల్లెమాలపై ఆరోపణలు చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తలో నాగబాబు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ఈ షో వల్ల ఆయన తన అప్పులను తీర్చుకోగలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు మార్లు చెప్పారు. అయితే ఉన్నట్లుండి ఈయన జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లాక ఈ షోను అన్ పాపులర్ చేసేందుకు ఎందుకు యత్నిస్తున్నారనేది అర్థం కావడం లేదని అంటున్నారు.
నాగబాబు జబర్దస్త్‌ను వీడినా షోకు పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే కమెడియన్స్ అందరూ నిన్న మొన్నటి వరకు ఈ షోలోనే ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే అందరూ దూరమవుతుండడంతో ఇదే అదనుగా భావించిన నాగబాబు జబర్దస్‌ను ఇంకా అణగదొక్కాలని చూస్తున్నారని.. అందుకనే అందులోని కమెడియన్లతో ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని.. ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అనేది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…