Nagababu : చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్చిన ఘ‌ట‌న‌పై నాగ‌బాబు స్పంద‌న‌.. ఏమ‌న్నారంటే..?

Nagababu : ఏపీ అసెంబ్లీలో త‌న భార్య‌పై వైసీపీ నేత‌లు దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని, అన‌రాని మాట‌లు అన్నార‌ని.. ఆరోపిస్తూ టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం ప్రెస్ మీట్‌లో క‌న్నీటి ప‌ర్యంతం అయిన విష‌యం విదిత‌మే. త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో చంద్ర‌బాబు ఏనాడూ ఏడ్చింది లేదు. ఆయ‌న ఎప్పుడూ గంభీరంగా క‌నిపించేవారు. అధికారంలో ఉన్నా లేక‌పోయినా ప్ర‌త్య‌ర్థుల‌పై నిప్పులు చెరిగేవారు. అలాంటి చంద్ర‌బాబు ఒక్క‌సారిగా డీలా ప‌డిపోయారు.

తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు లైవ్‌లోనే గుక్క పెట్టి ఏడ్చారు. అయితే దీనిపై రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. తాజాగా జ‌న‌సేన నాయ‌కుడు, సినీ న‌టుడు నాగ‌బాబు స్పందించారు. ఇది చాలా అనాగ‌రిక‌మైన చ‌ర్య అని ఆయ‌న న్నారు. సాటి మ‌నుషుల‌పై క్రూర‌త్వం ప్ర‌ద‌ర్శ‌రిస్తున్నార‌ని, నీచ సంస్కృతికి దిగ‌జారవ‌ద్ద‌ని నాగ‌బాబు వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేశారు.

చంద్రబాబు గారు మాకు ప్రత్యర్థి అయ్యి ఉండవచ్చు.. తెలుగుదేశం పార్టీ మాకు ప్రతిపక్షం అయ్యి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నేత ఇలా కన్నీటి పర్యంతం అయిన ఘటన నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది.. అని నాగబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన ఘటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో దుర్దినంగా ఆయన పేర్కొన్నారు. ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు తలచుకుని బాధ పడలేక పడాలో తెలియని సందిగ్ధ దుస్థితి ఏర్పడిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకీ పరాకాష్టకు నిలయంగా మారుతుందని అన్నారు.

ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో కించపరిచి తమని తాము హీనాతి – హీనమైన విలువలు లేని పురుగులుగా నిరూపించుకున్నారని నాగబాబు అన్నారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప.. ఒకరి కుటుంబాలను దూషించే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు.

గతంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా కుటుంబాన్ని ఇలాగే అనుచిత పదాలతో విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా.. ఆ బాధను అనుభవించిన మనిషిగా చెబుతున్నాను.. ఇది అనాగరికం మరియు సాటి మనుషుల పట్ల క్రూరత్వం. నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించు, నిలదీసి అడుగు. లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి. అంతేకానీ ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండి.. అని నాగ‌బాబు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఈ విష‌యాన్ని ట్వీట్ చేశారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM