Balakrishna : సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై తన మార్క్ ఏంటో చూపించిన బాలయ్య తాజాగా ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇక ఈ కార్యక్రమాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నారు.
మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా మారిన బాలకృష్ణ ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎలా సందడి చేయనున్నారోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు వస్తారని, వారి గురించి బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలోని మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు అతిథిగా రాబోతున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మెగా బ్రదర్ నాగబాబు, బాలకృష్ణ మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా ఎడమొహం పెడమొహం ఉన్న వీరిద్దరూ అన్‌స్టాపబుల్ వేదికగా కలవనున్నట్లు సమాచారం. మరి ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు పాల్గొంటే బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. అనే విషయంపై ఎంతో ఆతృత నెలకొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…