Nagababu : కెరీర్ మొదట్లో సినిమాలు చేసి ఆ తర్వాత బుల్లితెరపై యాంకరింగ్ చేసే అవకాశాన్ని అందింపుచ్చుకుంది అందాల శ్రీముఖి. ఇప్పుడు బుల్లితెరతోపాటు వెండితెరపై తన హవాని చూపిస్తోంది. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.
ఇందులో నాగాబాబు, శ్రీముఖి మధ్య సరదా సంభాషణ సాగింది. శ్రీముఖి నిన్ను ఎప్పట్నుంచో ఒకటి అడగాలని అనుకుంటున్నా అని నాగబాబు అడగడంతో శ్రీముఖి.. అడగండి బాబుగారు అని అంది. దీనికి నాగబాబు.. నీ నోటి నుంచి చక్కటి పాట వినాలనుంది. తప్పకుండా బాబుగారు .. రెడీయా! అని శ్రీముఖి.. దర్ దర్ బాద్ తుక్‌డే .. పాట పాడింది, ఇంకే ముంది. నాగబాబు కళ్లు తిరిగి పడిపోయారు. బాబుగారు అని శ్రీముఖి లేపినా లేవలేదు.
ఇది ఫన్నీ వీడియోగా వీరు షూట్ చేయగా, ఈ వీడియోకి శ్రీముఖి.. బాబు బంగారం.. కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ కూడా స్వీట్ పర్సన్ నాగబాబుగారిదే అంటూ క్యాప్షన్ పోస్ట్ చేసింది. ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, శ్రీముఖి ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలోనూ శ్రీముఖి నటించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…