సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటులలో నాగబాబు కూడా ఒకరు అని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అటు రాజకీయాల్లోనూ, ఇటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారిపోయారు నాగబాబు. అంతేకాకుండా బుల్లితెరపై కూడా కొన్ని కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు.
జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఎదుటి వారు చేసే కామెంట్లకు సోషల్ మీడియాలో తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ హల్ చల్ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే సభలో ఏర్పాట్లను పరిశీలిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, జనసేన పార్టీ గెలవడానికి కావల్సిన కసరత్తులు మొదలుపెట్టారు నాగబాబు.
అయితే ఇప్పుడు అదే విధంగా నాగబాబు చేసిన ఒక పోస్ట్ నెటిజన్లు చూపులను ఆకర్షించింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఏమంటారు బాయ్స్ అంటూ ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన మెసేజ్ పోస్ట్ చేశారు నాగబాబు. ఆ మెసేజ్ ఏంటంటే.. మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను.. ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు.. అంటూ ఒక స్మార్ట్ లుక్ ఇమేజ్ తో ట్వీట్ పోస్ట్ చేశారు.
అయితే నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఇలాగ పోస్ట్ చేశారు అనే విషయంపై కామెంట్స్ వర్షం కురుస్తోంది. మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటూ ఒకరు.. ఏంటి సార్ ఈ కొత్త లుక్ వెనుక ఉన్న ఆంతర్యం.. అంటూ మరొకరు, ఇన్ డైరెక్ట్ గా ఎవరి గురించి చెబుతున్నారు సార్.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి గురించి నాగబాబు ఇలా కామెంట్ చేస్తూ ఎందుకు ట్వీట్ చేశారు.. అనే విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…