Nagababu : మెగా బ్రదర్ నాగబాబు గురించి పరిచయాలు అక్కర్లేదు. ఆయన చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నయ్యగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యహరించడంతోపాటు ప్రస్తుతం తమ్ముడి జనసేన పార్టీ తరపున పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. అంతేకాదు తన బ్రదర్స్ తరపున అభిమానులకు వారధిగా మారారు. తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈవెంట్ హైదరాబాద్ హైటెక్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. మెగాస్టార్ కార్నివాల్ పేరుతో జరిగిన ఈ ఈవెంట్‌కు మెగా హీరోలతోపాటు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అలాగే ఎన్నో ఆసక్తికర విషయాలను నాగబాబు పంచుకున్నారు. 1976లో తను 21 సంవత్సరాల కుర్రవాడినని తనకంటూ ఇండస్ట్రీలో తన ముద్ర వేయాలని.. తనకంటూ గుర్తింపు ఉండాలని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఈ రోజు మహా సామ్రాజ్యాన్ని స్థాపించడం మాములు విషయం కాదని అన్నారు. మా ఇద్దరిదీ 62 ఏళ్ల అనుబంధం. మా అన్నయ్య గురించి నాకంటే ఇండస్ట్రీలో ఎక్కువగా చెప్పేవారు లేరు. మా అన్నయ్య బర్త్ డే అంటే ఇంట్లో ప్రత్యేకమైన రోజు. అన్నయ్య ఇప్పుడు అందరికీ హీరో కావచ్చు. కానీ నాకు చిన్నప్పటి నుంచే హీరో.
బన్నీ, చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్టవ్, నిహారిక, శిరీష్ వీరందరికీ బంగారు భవిష్యత్ ఇచ్చాడు. మా అన్నయ్య రుణం తీర్చుకోలేం. అతను ఎంత మంచి వాడో నాకు తెలుసు. మా అన్నయ్యను, పవన్ కళ్యాణ్‌ను ఎవరు విమర్శించినా నేను గట్టిగా కౌంటర్ ఇస్తాను. అందుకు నన్ను కంట్రావర్సీయల్ పర్సన్ అంటున్నారు. మీరు ఏమనుకున్నా ఫర్లేదు.. నా అన్నను.. తమ్ముడిని ఎవడైనా ఏదైనా అంటే.. తాటతీస్తా.. అందులో ఏ డౌట్ లేదు.. అంటూ నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…