Nagababu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఎంతో హడావిడి, ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికలు పూర్తి అయి, ఫలితాలు రావడంతో ఆ ఉత్కంఠకు తెర పడింది. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు.
అయితే మొదట్నుంచీ ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా ఉన్న నాగబాబు మాత్రం మంచు విష్ణు విజయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. అందుకనే కాబోలు ఆయన మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను 48 గంటల్లో మా అసోసియేషన్‌కు పంపిస్తానని తెలిపారు. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టాడుతున్న అసోసియేషన్‌లో ఇకపై కొనసాగలేనని, ఇక సెలవు.. అని నాగబాబు చెప్పారు.
అయితే మా ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. అవి చాలా చిన్న ఎన్నికలని, వాటి కారణంగా నటీ నటులు ఒకరిపై ఒకరూ దూషణలు చేసుకుని మా పరువు తీయవద్దని అన్నారు. అందరూ కలసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ నాగబాబు మాత్రం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం విశేషం.