Thank You Movie Review : లవ్ స్టోరీ, బంగార్రాజు మూవీలు సక్సెస్ కావడంతో అదే జోష్ తో చైతూ థాంక్ యూ అనే మూవీని చేశారు. ఇందులో ఆయనకు జోడీగా రాశి ఖన్నాతోపాటు మాళవికా నాయర్, అవికా గోర్‌లు నటింటారు. ప్రకాష్ రాజ్ మరో కీలకపాత్రను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ మూవీ శుక్రవారం (జూలై 22, 2022) థియేటర్లలో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. చైతూ దీంతో మరో హిట్ కొడతాడా.. అసలు కథ ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
అభిరామ్ (నాగచైతన్య) అమెరికాలో కంపెనీ పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చూస్తాడు. చివరకు అనుకున్నది సాధిస్తాడు. కానీ ఆ క్రమంలో అతను తన క్యారెక్టర్‌ను కోల్పోతాడు. గతంలో తనను ఇష్టపడేవాళ్లే తనను విడిచిపెట్టి పోయేలా మారుతాడు. దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ? అవేమిటి ? చివరకు ఏమవుతుంది ? అభిరామ్ మళ్లీ క్యారెక్టర్‌ను మార్చుకుంటాడా ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
ఈ సినిమా అంతటినీ నాగచైతన్య తన భుజాలపై మోశాడని చెప్పవచ్చు. నాగచైతన్య యాక్టింగ్‌కు పేరు పెట్టాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రను అయినా సరే అవలీలగా చేయగలడు. అయితే గత చిత్రాలకు భిన్నంగా ఇందులో చైతూ కనిపిస్తాడు. చైతన్య పాత్రలో మనకు కొత్తదనం కనిపిస్తుంది. ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌లతోపాటు ప్రకాష్ రాజ్ ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
దర్శకుడు విక్రమ్ కె.కుమార్ విషయానికి వస్తే.. ఆయన రాసుకున్న కథ, చెప్పిన విధానం బాగానే ఉంటాయి. కానీ ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. దీంతో సినిమాపై ఆసక్తి ఉండదు. ఇక మూవీని చూస్తుంటే గతంలో వచ్చిన ప్రేమమ్, రవితేజ నా ఆటోగ్రాఫ్ ఛాయలు కాస్త కనిపిస్తాయి. అందువల్ల కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే థాంక్ యూ ఓ డీసెంట్ మూవీగా నిలుస్తుంది. అయితే కొన్ని చోట్ల కథనం బోరింగ్‌గా ఉంటుంది.
ఇక థమన్‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎంతో పేరుంది. అఖండకు ఆయన చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అలాగే సర్కారు వారి పాటకు కూడా థమన్ అద్భుతంగా సంగీతం అందించాడు. కానీ థాంక్ యూలో మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీకి పేరు పెట్టాల్సిన పనిలేదు. సినిమాకు కావల్సిన మేర అవుట్‌పుట్ ఇచ్చారు. ఇక ఎడిటింగ్ కాస్త మెరుగ్గా ఉంటే బాగుండనిపిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే థాంక్ యూ సినిమాకు నాగచైతన్య యాక్టింగ్, తక్కువ రన్ టైమ్, పాజిటివ్ మెసేజ్ వంటివి ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక కథలో ఏం జరుగుతుందో ముందుగానే తెలిసిపోతుండడం, ఎమోషన్స్ అంతగా పండించలేకపోవడం, కథ కొన్ని సందర్భాల్లో తేలిపోవడం, కొత్తదనం లేకపోవడం, సంగీతం వంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ చాలా చోట్ల ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారు. కనుక ఏదైనా డిఫరెంట్ మూవీని చూద్దామనుకుంటే.. థాంక్ యూ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ మూవీని ప్రేక్షకులు ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…