Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి, నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చై సామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అనేక మంది అభిమానులు భవిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది. సమంత, నాగచైతన్య విడాకులకు ముందు చాలా సినిమాల్లో కలిసి నటించారు.
వీరిద్దరూ కలిసి నటించిన మనం, మజిలీ, ఏ మాయ చేసావే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే వీటిలో మజిలీలో మాత్రం పెళ్లి తర్వాత నటించారు. ఇదిలా వుండగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏం మాయ చేసావే సినిమాకు సీక్వెల్ తీస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు సమంత, నాగచైతన్య పేర్లు ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ ఇప్పటికే సమంతతో మాట్లాడారని సమంత.. నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం.
గతంలో నాగచైతన్యకి ఇదే ప్రశ్న ఎదురైతే భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే.. నో అయితే చెప్పనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపై మళ్ళీ నాగచైతన్య, సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకటైనా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం మాయ చేసావే 2 కి స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుందో..? మళ్లీ ఇద్దరిని మనం ఎప్పుడు తెరపై చూస్తామో..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…