అక్కినేని నాగచైతన్య లేటెస్ట్‌గా నటించిన మూవీ.. థాంక్ యూ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండో రోజే సినిమాకు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల తరువాత ఈ మూవీ ఫ్లాప్ అయింది. అయితే ఈ నెల 11వ తేదీన చైతూ నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో చైతన్యకు ఇదే తొలి మూవీ కాగా.. దీనికి నాగార్జున సైతం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక తెలుగులో ఈ మూవీని అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సమర్పిస్తోంది.
లాల్ సింగ్ చడ్డా మూవీలో నాగచైతన్య బాలరాజు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఆయన పాత్ర నిడివి 15 నిమిషాలు ఉంటుందని తెలిసింది. ఇందులో అమీర్‌ఖాన్ స్నేహితుడి పాత్రలో చైతూ కనిపించనున్నాడట. అయితే చైతన్య రెమ్యునరేషన్ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు.. అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు.
నాగచైతన్య వాస్తవానికి తనకు ఫలానా మొత్తం కావాలని ఏనాడూ నిర్మాతలను అడగలేదట. వారు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాడట. ఇక ఇప్పటి వరకు చైతూ ఒక్క మూవీకి రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ లాల్ సింగ్ చడ్డాకు మాత్రం రూ.5 కోట్లు తీసుకున్నాడట. ఎందుకంటే అందులో ఆయనది పూర్తి నిడివి ఉన్న పాత్ర కాదు. ఇక యంగ్ హీరోల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంది. ఈయన ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటున్నారు. పుష్ప 2 కు అయితే బన్నీ ఏకంగా రూ.120 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్. అయినప్పటికీ చైతన్య మాత్రం చాలా తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…