Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన థాంక్ యూ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అందులో చైతూకు జంటగా రాశిఖన్నా నటించింది. ఇక త్వరలోనే ఈ మూవీ విడుదల కానుండగా.. చైతూ ప్రస్తుతం వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో త్వరలో స్ట్రీమ్ కానుంది.

చైతూ నటించనున్న వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. దీన్ని హార్రర్ థ్రిల్లర్ జోనర్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఇందులో చైతన్య పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుందని సమాచారం. ఇక దీనికి మనం సినిమా ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
ఇక ఈ సిరీస్‌కు ధూత అనే డిఫరెంట్ టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సిరీస్‌లో చైతూ చాలా త్వరగా షూటింగ్ ముగించుకోనున్నాడని తెలుస్తోంది. ఆ తరువాత ఇంకో ప్రాజెక్టులో చైతూ నటించనున్నాడు. ఇక చైతన్య నటించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డా త్వరలోనే విడుదల కానుంది. ఇందులో అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.