Naga Babu : పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారంలో నిహారిక పేరు బయటకు రావడంతో ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతోంది. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసు బృందాలు, అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది యువతీ యువకులను అరెస్ట్ చేశారు. పబ్ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. బాగా డబ్బున్న పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండే ఈ పుడింగ్ మింక్ పబ్ ఏర్పాటు చేసిన లేట్ నైట్ పార్టీలో సింగర్ రాహుల్ సింప్లి గంజ్, నిహారిక కొణిదెలతోపాటు పలువురు ప్రముఖుల వారసులు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి.

తెల్లవారుజాము కావడంతో మీడియా కంట పడకుండా చాలా మంది ప్రముఖులు పిల్లలు పైరవీల ద్వారా తప్పుకున్నారు అని సమాచారం.అయితే నిహారిక అడ్డంగా బుక్ కావడంతో ఆమెపై అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక పోలీసులు తమకు ఇచ్చిన సమాచారం మేరకు.. నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదని చెప్పినట్లు నాగబాబు స్పష్టం చేశారు. దీనిపై ఎటువంటి స్పెక్యులేషన్స్ ప్రచారం చేయొద్దని వీడియో ద్వారా కోరారు. అయినప్పటికీ శ్రీ రెడ్డి, శ్వేతారెడ్డితోపాటు పలువురు యాంటీ మెగా పర్సన్స్ బురదజల్లుతూనే ఉన్నారు.
https://twitter.com/NagaBabuOffl/status/1511719506204262401
ఈ క్రమంలో స్పందించిన నాగబాబు ఒక్క వీడియోతో పుకార్లన్నింటికీ పుల్ స్టాప్ పెట్టాడు. కుక్కలు అలానే మొరుగుతుంటాయి అని అర్ధం వచ్చేలా ఓ పాపులర్ ఆల్బమ్‌లోని హూ లెట్స్ ది డాగ్స్ ఔట్ అనే వీడియో పోస్ట్ చేశాడు. దీనితో నాగబాబు పుకార్లు పుట్టించే వారికి గట్టిగా సమాధానం ఇచ్చాడని కొందరు చెబుతున్నారు. అసలు నిహారిక డ్రగ్స్ తీసుకుందా ? లేదా ? అనేది పక్కన పెడితే ఒక పెళ్ళైన అమ్మాయి, కనీసం భర్త పక్కన లేకుండా పబ్ లు, పార్టీలలో పాల్గొనడం ఏమిటి ? అది కూడా డ్రగ్స్ వినియోగిస్తున్న లేట్ నైట్ పార్టీలలో ఎంజాయ్ చేయడమేమిటి ? అంటూ నెటిజెన్స్ నిలదీస్తున్నారు. ఈ కోణంలో నాగబాబును వారు టార్గెట్ చేస్తున్నారు.