Varun Tej : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున ప్రభాస్ గుర్తుకొస్తారు. ఈయన తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు. ఈయనతోపాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గతంలో సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టనున్నారని వార్తలు వచ్చాయి.

ఈ విధంగా తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై లావణ్య త్రిపాఠి స్పందిస్తూ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబుకు ఒక నెటిజన్ నుంచి మరోసారి వరుణ్ పెళ్లి ప్రస్తావన ఎదురైంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు బ్రో అంటూ సదరు నెటిజన్ నాగబాబును ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నాగబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ ప్రశ్న విని విని విసిగి పోయాను, ఈ ప్రశ్నకు సమాధానం వరుణ్ తేజ్ ను అడగండి.. అంటూ సమాధానం చెప్పారు. ఇలా నాగబాబు తన కొడుకు పెళ్లి గురించి సమాధానం చెప్పడంతో పలువురు ఈయన చెప్పిన సమాధానం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక తండ్రిగా కొడుకు పట్ల బాధ్యతగా ప్రవర్తించకుండా ఇలా అతన్నే అడగమని చెప్పడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి తన పెళ్లి గురించి అయినా వరుణ్ తేజ్ స్పందిస్తాడో లేదో చూడాలి.