Munugode Bypoll : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడిన విషయం విదితమే. అయితే ఆ అసెంబ్లీ సీటుకు గాను ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. మునుగోడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రకటనను విడుదల చేసింది.
నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరగనుండగా.. 6వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 14 కాగా.. ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ప్రచారం మొదలు పెట్టేశారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. మద్యం, మటన్, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దావత్‌లు ఇస్తున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి గాను ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. తెరాస నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ వస్తుందని చెబుతున్నారు. ఇక బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేయనున్నారు. అయితే కోమటిరెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి ఉప ఎన్నిక నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ తేదీని చెప్పడంతో ఇక తెలంగాణలో రాజకీయాలు మరింతగా వేడెక్కనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…