OTT : ప్రస్తుత తరుణంలో ఓటీటీల హావా నడుస్తుంది. పెద్ద పెద్ద సినిమాలు తప్ప మిగతా తక్కువ బడ్జెట్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీల్లోనే విడుదల అవుతున్నాయి. దానికి తగ్గట్టు ప్రజల్లో కూడా ఓటీటీల పట్ల ఆదరణ పెరుగుతోంది. ప్రతి వారం థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకు దీటుగా ఓటీటీల్లో కూడా సినిమాలు, షో లు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈ వీక్ లో కూడా డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి పలు ఓటీటీలలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ 1వ సీజన్ సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో రెండవ సీజన్ మరింత ఆకర్షించే విధంగా రాబోతుంది. మొదటి సీజన్ కంటే ఎక్కువ ఫన్, ఎక్కువ డేర్ ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఇక ఈ షో సెకండ్ సీజన్ ఆహా ఓటీటీలో అక్టోబర్ 14 నుండి మొదలు కాబోతుంది.
మోడ్రన్ లవ్ డ్రామా గా చిత్రీకరించిన మిస్ మ్యాచ్డ్ సిరీస్ మొదటి సీజన్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ సిరీస్ 2వ సీజన్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికపై అక్టోబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది.
విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం దొబారా. తాప్సీ పన్ను ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ పై అక్టోబర్ 15 నుండి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీ ప్రసారం కానుంది.
అలాగే అంజలి లీడ్ రోల్ లో నటిస్తున్న ఝాన్సీ అనే సిరీస్, బెల్లంకొండ గణేష్ హీరోగా చేసిన స్వాతిముత్యం సినిమా, దగ్గుబాటి రానా, వెంకటేష్ లు ముఖ్య పాత్రల్లో నటించిన రానానాయుడు అనే వెబ్ సిరీస్, ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా చిత్రం, ఇలా పలు సినిమాలు, సిరీస్ లు ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటి యొక్క స్ట్రీమింగ్ తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…