Most Eligible Bachelor : సినిమా జోనర్‌లలో కామెడీకి ఎప్పుడూ ప్రేక్షకులు పెద్ద పీట వేస్తారు. ప్రముఖ హీరోలు కూడా కామెడీని నమ్ముకుని గట్టెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కామెడీ జోనర్ అనేది సినిమాల్లో ఎవర్ గ్రీన్ లాంటిదని చెప్పవచ్చు. ప్రేక్షకులు కామెడీ సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే అగ్ర హీరోలు కూడా తమ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్లకు తోడు కామెడీ సీన్లను కూడా దండిగానే ఏర్పాటు చేస్తున్నారు.
ఇక అక్కినేని అఖిల్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని, వారిని కడుపుబ్బా నవ్విస్తుందని.. టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే కామెడీ సీన్లు ఇందులోనూ దండిగా ఉన్నాయని చెప్పవచ్చు. అఖిల్ ఈ జోనర్‌ను పెద్దగా ట్రై చేయలేదు. కానీ కామెడీ ద్వారా అఖిల్ ఈ మూవీతో పక్కాగా హిట్ కొడతాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.
మూవీలో అనేక మంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. పైగా అఖిల్ చేసిన కామెడీ బాగుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కామెడీ ద్వారా సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 15న విడుదల కానుండగా.. దీన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. ఈ మూవీలో ఆమని, ఈషా రెబ్బా, చిన్మయి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జయప్రకాష్, అజయ్, ప్రగతి, అమిత్ తివారీ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభయ్ వంటి కీలక నటులు చక్కని పాత్రలను పోషించారు. దీనికి గోపీ సుందర్ సంగీతం అందించగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. బన్నీ వాస్ – వాసు వర్మ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…