Most Eligible Bachelor : అఖిల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, దర్శకులు సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో బన్నీ, ఆయన తండ్రి అల్లు అరవింద్ పూజా హెగ్డేపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బన్నీ.. పూజా గురించి చెబుతూ.. నా ఒక్కడికే తను స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు. అందరికీ స్పెషలే. తను ఏ హీరోతో నటిస్తే వారు హిట్ అందుకున్నట్టే అని అన్నారు. ఇక అల్లు అరవింద్ తగ్గేదేలే అంటూ వేదికపై స్పీచ్ స్టార్ట్ చేశారు.
పూజా గురించి మాట్లాడిన అరవింద్ .. మా డార్లింగ్ పూజా అనేశాడు. ఈ సినిమాలో చించేసింది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కెరీర్‌లో ఇదో బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ అని గర్వంగా చెబుతున్నా అన్నారు. నీ కెరీర్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్నారు అరవింద్. భాస్కర్‌తో సినిమా తీసేటప్పుడు ఒళ్లునొప్పులు ఉంటాయి కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…