Srihari : రియల్ స్టార్ శ్రీహరి తన సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి. హీరోగా, విలన్ గా నటించి శ్రీహరి తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. శ్రీహరి నటించిన మూఠామేస్ట్రీ, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా వంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించాడు. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
కానీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో శ్రీహరి మరణించడం టాలీవుడ్ కి తీరని లోటని చెప్పవచ్చు. శ్రీహరి వారసత్వంతో కాకుండా నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. బాడీ బిల్డింగ్ పై తనకు ఉన్న ఆసక్తితో శ్రీహరి మిస్టర్ హైదరాబాద్ గా కూడా గెలిచాడు. మార్షల్ ఆర్ట్స్ లోనూ శ్రీహరికి మంచి పట్టుంది. అలా అంచలంచెలుగా ఎదిగిన శ్రీహరి ప్రముఖ నటుడిగా ఎదిగాడు. అంతేకాదు సినీ పరిశ్రమలోని డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ 2013లో తీవ్ర అనారోగ్యం కారణంగా శ్రీహరి మరణించాడు.

అయితే శ్రీహరి ఎక్కువగా మద్యం సేవించేవాడని అందువల్లే అనారోగ్యంతో మృతి చెందాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా శ్రీహరికి సన్నిహితులు టాలీవుడ్ సీనియర్ నటుడు మేక రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేక రామకృష్ణ బాహుబలి సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శ్రీహరి ఎంతో మంచి వాడని చాలా ఆప్యాయంగా పలకరించేవాడని అన్నాడు. అంతే కాకుండా ఆయన మరణానికి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడమే కాదు.. శ్రీహరి ఎక్కువగా పాన్ పరాక్ లు తినేవాడని తెలిపాడు.