Manchu Vishnu : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు విష్ణు హీరోగా కొన్ని సినిమాలు సక్సెస్ అయినా అంతగా రాణించలేదు. మంచు విష్ణు సినిమా హిట్ కొట్టి చాలా ఏళ్లు అయింది. చివరగా ఆయన మోసగాళ్లు సినిమాలో కనిపించారు. అందులో కాజల్, మంచు విష్ణు అక్కా తమ్ముళ్లుగా కనిపించారు. ఇక ఈ మధ్య విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయి మరోసారి ఫామ్ లోకి వచ్చారు. ఇక ఈ ఎన్నికల సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూల్లో మంచు విష్ణు చేసిన వాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చింది. ఇక విష్ణు వీటి గురించి మాట్లాడుతూ నేను మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన అసలు లేదు అయితే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు వచ్చి అడిగారు. నేను నాన్నని సంప్రదిస్తే ఎందుకు ఇపుడు అని అన్నారు. ఆ తరువాత నీ ఇష్టం పోటీ చేయాలని అనుకుంటే చెయ్యి అన్నారు. అలా నేను ఎలక్షన్ లోకి దిగాను.
ఒకవేళ నాన్న వద్దు అనుంటే నాకు ఇష్టమైనా వదులుకునేవాడిని అంతే కానీ చిరంజీవి అయినా అయన వెనుక దేవుడు ఉన్నా నేను తగ్గను.. నాకు అందరి కంటే ముందు మా నాన్న. ఆయన మాట కచ్చితంగా పాటిస్తాను అన్నారు విష్ణు. ఇక రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో విష్ణు మా ఎలక్షన్స్ లో పోటీ చేశాడు అన్న కామెంట్స్ కి స్పందిస్తూ.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంటే నేను ఎప్పుడో వెళ్ళేవాడిని. మా నాన్న రాజ్యసభ మాజీ మెంబర్.
ఇపుడున్న ఏపీ సీఎం మా బావ, ఇక ఇక్కడున్న తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ తో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకుని నేను మా ఎలక్షన్ ను నా రాజకీయ అరంగేట్రానికి వాడుకుంటానని అనుకోవడం వాళ్ల మూర్ఖత్వం అన్నారు. అప్పుడు విష్ణు అన్న ఈ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పూత్, సన్నీలియోన్ లు హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే అప్పటి మంచు విష్ణు కామెంట్స్‌ను ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారనే విషయం అర్థం కావడం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…