Manchu Vishnu : మంచు విష్ణు ట్వీట్‌పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించండి.. అంటూ కామెంట్స్‌..!

Manchu Vishnu : మంచు ఫ్యామిలీకి ఈ మ‌ధ్య ఏం చేసినా క‌ల‌సి రావ‌డం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా)కు మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ‌డం ఒక్క‌టే.. వారికి క‌ల‌సి వ‌చ్చిన అంశం. ఆ త‌రువాత నుంచి వారి ఫ్యామిలీ తెగ విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతోంది. అప్ప‌ట్లో క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ఆయ‌న మృతిని ఇంకా ధ్రువీక‌రించ‌క‌ముందే మంచు ల‌క్ష్మి ట్వీట్ చేసి అడ్డంగా బుక్క‌యింది. దీంతో నెటిజ‌న్లు ఆమెను ఒక ఆట ఆడుకున్నారు.

Manchu Vishnu

ఇక త‌రువాత టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మెగాస్టార్ చిరంజీవి తీవ్ర‌మైన కృషి చేశారు. కానీ మా అధ్య‌క్షుడి హోదాలో ఉండి కూడా మంచు విష్ణు అస‌లు అందుకు చిన్న ప‌ని కూడా చేయ‌లేదు. దీంతో నెటిజ‌న్లు, ఫ్యాన్స్ మ‌రోమారు మంచు ఫ్యామిలీపై విమ‌ర్శ‌లు చేశారు. త‌రువాత మోహ‌న్ బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా అత్యంత భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ప‌ట్ల నెటిజ‌న్ల ట్రోల్స్‌, విమ‌ర్శ‌లు మరీ ఎక్కువ‌య్యాయి. ఆ త‌రువాత మంచు విష్ణు త‌న ప‌ర్స‌న‌ల్ హెయిర్ స్టైలిస్ట్‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. ఇది కూడా మంచు ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తెచ్చి పెట్టింది. దీంతో మంచు ఫ్యామిలీ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ మ‌ధ్య కాలంలో ట్రోల్స్‌ను, విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మంచు విష్ణు, ల‌క్ష్మి, మోహ‌న్ బాబుల‌పై జోకులు పేలుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా మంచు విష్ణు మ‌రోమారు ట్రోల‌ర్స్ బారిన ప‌డ్డారు. అందుకు ఆయ‌న చేసిన ట్వీటే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అప్ప‌ట్లో ఆయ‌న శ్రీ‌ను వైట్ల‌తో చేసిన ఢీ సినిమా బంప‌ర్ హిట్ అయింది. అందులో జెనీలియా, శ్రీ‌హ‌రి న‌టించారు. అయితే ఆ మూవీ వ‌చ్చి 15 ఏళ్లు పూర్త‌యింద‌ని చెబుతూ విష్ణు ట్వీట్ చేశారు. దీంతో ట్రోల‌ర్స్‌కు మ‌ళ్లీ ప‌ని క‌ల్పించిన‌ట్లు అయింది. ఈ క్ర‌మంలోనే వారు విష్ణును పెద్ద ఎత్తున మ‌రోమారు విమ‌ర్శిస్తున్నారు.

అన్నా.. మీరు ఇంకా ఢీ మూవీ ధ్యాస‌లోనే ఉన్నారు, బ‌య‌ట‌కు రండి.. అని ఒక ట్రోల‌ర్ కామెంట్ చేయ‌గా.. మీరు ఈ మ‌ధ్య యాక్ష‌న్‌కు బ‌దులుగా ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నారు.. త‌గ్గించుకుంటే మంచిద‌ని.. ఇంకో నెటిజ‌న్ విమ‌ర్శించాడు. అలాగే మీరు యాక్ష‌న్ మూవీల‌పై దృష్టి పెట్టండి, కామెడీ మూవీలు కాదు.. అని ఇంకో నెటిజ‌న్ రిప్లై ఇచ్చాడు. ఇలా చాలా మంది మంచు విష్ణు ట్వీట్‌పై కామెంట్స్ పెడుతున్నారు. అయితే మా అధ్య‌క్షుడిగా ఉన్న మంచు విష్ణు తాను చెప్పిన ప్ర‌కారం మా బిల్డింగ్ క‌డ‌తాడా.. లేదా.. అని ఇంకొంద‌రు కూడా ప్ర‌శ్నించారు. కానీ అందుకు విష్ణు స‌మాధానం అయితే చెప్ప‌లేదు.

ఇక ప్ర‌స్తుతం విష్ణు ఓ కామెడీ మూవీ చేస్తున్నారు. అందులో ఆయ‌న పాత్ర పేరును ఇటీవ‌లే రివీల్ చేశారు. గాలి నాగేశ్వ‌ర్ రావుగా ఆయ‌న క‌నిపించనున్నారు. విష్ణుకు జోడీగా పాయ‌ల్ రాజ్‌పూత్ న‌టిస్తుండ‌గా.. స‌న్నీ లియోన్ ఇంకో కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM