Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు హోరా హోరీగా సాగిన విషయం తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలిచాడు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు కూడా కొందరు గెలిచారు. అయితే వీరందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలలోనే మంచు విష్ణు ఎలాంటి హడావిడి లేకుండా ట్విట్టర్ ద్వారా తాను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు సంబంధించిన 11 మంది రాజీనామా చేయడంతో ఇప్పుడు వ్యవహారం చాలా హీటెక్కింది. విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విష్ణు.. పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘మా’ బై లా రూల్ పొజిషన్ 17 ప్రకారం ‘మా’లో ఎవరైనా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే, అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని భర్తీ చేస్తారు. ఆ పదవికి మరొక వ్యక్తిని నామినేట్ చేస్తారు. అయితే.. ఆ నియామకం తర్వాత జరిగే జనరల్ బాడీ మీటింగ్‌లో సభ్యుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్ స్థానంలో విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాబూమోహన్‌ను నామినేట్ చేసే అవకాశం ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…