Manchu Vishnu : మంచు విష్ణు అంటే టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఢీ లాంటి సూపర్ హిట్ సినిమాతో మంచు విష్ణు అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే మంచు విష్ణు దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఢీ తర్వాత మళ్లీ అంతటి హిట్ సినిమాను అందుకోలేకపోయాడు. చివరగా మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 21న.. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా జిన్నా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించారు. జిన్నా విడుదల సందర్భంగా విష్ణు వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నట్లు మంచు విష్ణు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కొందరు డబ్బులిచ్చి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారంటూ ఎప్పటినుంచో అంటూనే ఉన్నాడు. అయితే తనపై ట్రోల్స్ చేయిస్తోంది ఎవరో తనకి తెలుసని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్కడు ఎవరన్నది ఇండస్ట్రీ, మీడియాలో ఉన్న వారందరికీ తెలుసు. వాళ్ల పేరు నేను నా నోటితో చెప్పాలనుకోవడం లేదు. నేను న్యూటన్ మూడో సూత్రాన్ని బాగా నమ్ముతాను.
ఎవ్రీ యాక్షన్ హ్యావ్‌ఏ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మనం సొసైటిలోకి పాజిటివ్ పంపితే పాజిటివ్ తిరిగి వస్తుంది. నెగెటివ్ పంపితే నెగెటివిటీనే మనకు వస్తుంది. నేను దేవుడిని, ప్రకృతిని బాగా నమ్ముతాను. మనం ఏదైతే ఇస్తామో.. అదే తిరిగి వస్తుంది. నాపై ట్రోల్స్ చేయిస్తున్న వారి పేరును కూడా నా నోటితో చెప్పాలి అని నేను అనుకోవడం లేదు. ఇంతకు ముందు నా మీద ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. నేను ఎప్పుడైతే మా ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచానో.. అప్పటి నుంచే నాపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది అంటూ తనపై వచ్చే ట్రోలింగ్ విషయం గురించి మరోసారి ప్రస్తావించాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అలా చేస్తున్నాడు అనే విషయాలను మాత్రం చెప్పలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…