Manchu Vishnu : టాలీవుడ్ లో మంచు మోహన్ బాబుకి ప్రత్యేక స్థానం ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన నటించిన సినిమాలు, పోషించిన పాత్రలు, నిర్మించిన చిత్రాలు ఆయన స్థాయిని అమాంతం పెంచాయి. ఎన్నో వైవిధ్య పాత్రలను పోషించి టాలీవుడ్ లెజెండ్ అన్నట్లుగా ఉండే మోహన్ బాబు ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన హీరోకి కూడా ఇంత దారుణమైన కలెక్షన్స్ రావు. మంచు ఫ్యామిలీ సినిమా అంటే మాత్రం జనాలు బాబోయ్ అంటున్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఆల్ టైం డిజాస్టర్ మోహన్ బాబు నమోదు చేశాడు.
పోస్టర్ ఖర్చులు, పార్కింగ్ చార్జీలు కూడా రాలేదు. ఇప్పుడు తండ్రి సన్ ఆఫ్ ఇండియాతో క్రియేట్ చేసిన రికార్డ్స్ కొడుకు మంచు విష్ణు జిన్నాతో బ్రేక్ చేస్తున్నాడు. కనీసం రూ. 50 లక్షల షేర్ జిన్నా సినిమాకు రాలేదు. దీపావళికి 4 సినిమాలు విడుదల కాగా జిన్నా అతి తక్కువ వసూళ్లు నమోదు చేసింది. కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ లేదు. జనాలు లేక రెండో రోజే షోస్ రద్దు అయ్యాయి. ఇక యూఎస్ లో కేవలం 100 టికెట్స్ అమ్ముడుపోగా రూ. 1.25 లక్షలు వసూలు చేసింది. జిన్నా సినిమా తక్కువలో తక్కువ రూ. 4 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే పదోవంతు వసూళ్లు కూడా రాలేదు.
మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ నటించారని తెలిస్తే ఆ సినిమా బాగోదని జనాలు ఫిక్సయిపోతున్నారు. మోసగాళ్లు సినిమాతో మంచు విష్ణు భారీగా నష్టపోయాడు. మోసగాళ్లు రిజల్ట్ చూశాక మనోజ్ ప్రకటించిన పాన్ ఇండియా మూవీ అహం బ్రహ్మస్మి నిర్మించే సాహసం ఆ ఫ్యామిలీ చేయడం లేదు. ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టిన మనోజ్ మరో అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు తమ చిత్రాలను కుట్ర పూరితంగా దెబ్బతీస్తున్నారని మోహన్ బాబు, విష్ణు ఆరోపణలు చేస్తున్నారు. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైన ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఎన్నోసార్లు రుజువైంది. ఇకనైనా మంచు ఫ్యామిలీ కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…