Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు సమంత ప్రకటించిన తరువాత.. నిజానికి ఆమెనే ఎక్కువ మంది నిందించారు. ఆమె అబార్షన్ చేయించుకుంటానందని, పిల్లల్ని కనడం ఇష్టం లేదని, సరోగసీకి వెళ్దామని అన్నదని.. ఆమె నటించిన సిరీస్ లు, సినిమాల్లో బోల్డ్ కనిపించడం వల్లే.. అని ఇలా రక రకాలుగా వారి విడాకులకు సమంతనే నిందించారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ ఈ విషయంలో హద్దు మీరి ప్రవర్తించాయి. దీంతో వారిపై పరువు నష్టం కేసు వేయగా.. అది కోర్టులో విచారణలో ఉంది.
అయితే తాజాగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. వేధింపులను ఎదుర్కొనే మా మహిళా సభ్యుల విషయంలో కీలక ప్రకటన చేశారు. అలాంటి మహిళా సభ్యులకు మా అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. వ్యూస్ పెంచి పాపులర్ అవడం కోసం కొన్ని యూట్యూబ్ చానల్స్ హీరోయిన్లు, ఇతర నటీమణులపై లేని పోని తప్పుడు కథనాలను వీడియోలలో ప్రసారం చేస్తున్నాయని, తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి ప్రతిష్టను దిగజారుస్తున్నాయని.. అలాంటి చానల్స్‌ను విడిచిపెట్టబోమని.. మంచు విష్ణు స్పష్టం చేశారు.
ఇక యూట్యూబ్ చానల్స్ వేధింపుల వల్ల ఇబ్బందులకు గురయ్యే మా మహిళా సభ్యుల కోసం ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తామని తెలిపారు. అయితే మంచు విష్ణు చేసిన ప్రకటన సమంతకు వర్తిస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా.. విడాకుల ప్రకటనతో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. అయినప్పటికీ పలు సినిమాలకు సంతకం చేసి ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…