Manchu Vishnu : మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొద్ది నెలల పాటు ఆయన మా సమస్యలపై ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో.. అందరూ విమర్శించారు. మా భవనాన్ని ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని ప్రత్యర్థులు కౌంటర్ వేశారు. దీంతో కొంత కాలానికి విష్ణు స్పందించి మా సమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. అయితే తాజాగా అసోసియేషన్ నియమ నిబంధనలను పూర్తిగా మార్చేసినట్లు చెప్పారు. ఇకపై రూల్స్ చాలా కఠినంగా ఉంటాయన్నారు. మా మెంబర్‌షిప్ పొందడం అంత ఈజీ కాదన్నారు. కొందరు మెంబర్లుగా ఉన్నప్పటికీ ఒక్కసినిమాలోనూ నటించలేదన్నారు. కనుక రూల్స్‌ను మారుస్తున్నట్లు చెప్పారు.
ఇక మా సభ్యులు ఎవరైనా తమకు సమస్యలు ఉంటే అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాలని.. మీడియా ముందుకు వెళ్లకూడదని.. విష్ణు అన్నారు. ఎవరైనా మీడియా ముందుకు వెళితే అలాంటి వారిని వెంటనే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు పరుస్తామని.. తప్పు చేశారని తేలితే వెంటనే అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తామని.. అలాగే అవసరం అయితే శాశ్వతంగా నిషేధం విధిస్తామని.. దీంతో వారు మా అసోసియేషన్‌లో ఉండేందుకు అనర్హులని అన్నారు.
అలాగే మా అసోసియేషన్‌లో సభ్యులుగా కనీసం 5 ఏళ్ల నుంచి ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులని విష్ణు అన్నారు. అయితే వారు సస్పెండ్ అయి ఉన్నా లేదా మా కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. వ్యతిరేకంగా మాట్లాడినా.. వారు పోటీ చేసేందుకు అనర్హులని తెలిపారు. ఈ రూల్స్ అన్నింటినీ త్వరలోనే మార్చబోతున్నట్లు వివరించారు. కాగా విష్ణు చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఏడాది కిందట మా అధ్యక్షుడిగా గెలిచిన ఆయన అప్పుడే రూల్స్ మార్చకుండా ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కొత్త రూల్స్ కాస్త కఠినంగానే ఉన్నాయని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…