Manchu Vishnu : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర నటీనటులకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్న విషయం విదితమే. అందుకనే ఫ్లాప్‌లను ఎదుర్కొన్నా.. కొన్ని సార్లు సొంత సంస్థల ఆధ్వర్యంలో సినిమాలు తీసి హిట్ కొట్టి మళ్లీ నటులు ఫామ్‌లోకి వస్తుంటారు. ఇందుకు వారికి తమ సొంత నిర్మాణ సంస్థలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.
ఇక సీనియర్ నటుడు మోహన్‌బాబుకు కూడా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వంటి నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కానీ అవి ఉన్నప్పటికీ మంచు హీరోలు సినిమాల్లో హిట్‌లు కొట్టలేకపోతున్నారు. అలాగే ఈ సంస్థల ఆధ్వర్యంలో ఇతర హీరోలతో సినిమాలు తీసినా వర్కవుట్ కావడం లేదు. అయితే ఇకపై మంచు విష్ణు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
మంచు విష్ణు అవా (ava) ఎంటర్‌టైన్‌మెంట్ పేరిట ఓ డిజిటల్ సంస్థను స్థాపించినట్లు సమాచారం. ఈ సంస్థ పేరిట వెబ్ సిరీస్‌లు, బడ్జెట్ మూవీలను తీయనున్నారట. వాటిని ఓటీటీల కోసమే ప్రత్యేకంగా తీస్తారట. దీంతో ఓటీటీలకు వాటిని విక్రయించి లాభాలు గడించవచ్చన్నమాట. ప్రస్తుతం.. రాబోతున్నది.. అంతా డిజిటల్, ఓటీటీల యుగమే కనుక.. ఈ దిశగా వ్యాపారం చేస్తే అయినా సక్సెస్ కావొచ్చని మంచు విష్ణు ఆలోచించారట. అందుకనే ఆ సంస్థను ఏర్పాటు చేశారట.
అయితే దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఇక దీంతోపాటు త్వరలోనే ఒక ఓటీటీ యాప్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే త్వరలో మంచు వారి ఓటీటీ యాప్ కూడా రంగ ప్రవేశం చేస్తుందన్నమాట. మరి ఆహాకు అది పోటీనిస్తుందా.. లేదా.. అసలు మంచు వారు ఓటీటీ యాప్‌ను తెస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…