Manchu Vishnu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు. విష్ణు, శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఢీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవల మంచు విష్ణు మా అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మంచు విష్ణు జిన్నా సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో షాకింగ్ విషయాలను బయటపెట్టాడు విష్ణు. తనపై వస్తోన్న ట్రోల్స్ వెనకాల ఓ ప్రముఖ స్టార్ హీరో ఉన్నాడంటూ దుమారం రేపాడు.
ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో 21 మంది ఉద్యోగులను నన్ను టార్గెట్ చేయడానికి, నా ఫ్యామిలీని హెరాస్ చేయడానికి నియమించారని, ఆ ఆఫీస్ అడ్రస్ ఒక ప్రముఖ నటుడి ఆఫీస్, ఐపీ అడ్రస్ మాకు లభించాయి. 85 శాతం ట్రోల్స్ అక్కడి నుంచే వస్తున్నాయి అని పేర్కొన్నాడు విష్ణు. అంతేకాదు 18 యూట్యూబ్ ఛానల్స్‌పై చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపాడు. వారిపై కోర్ట్ లో గురువారం కేసు వేయాలనుకున్నట్టు, ఈ యూట్యూబ్ ఛానల్స్ తమపై, ఇంకొందరు హీరో హీరోయిన్లపై తప్పుడు సమాచారం ప్రసారం చేస్తున్నట్టు పేర్కొన్నాడు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశాడు. ఇప్పుడు మంచు విష్ణు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇప్పుడు దీనిపై కూడా సెటైర్లు వేస్తున్నారు. మంచు విష్ణు ఆరోపించిన ఆ హీరో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అలాగే కంపెనీ పెట్టి మరీ ఎవర్రా ఇంత పనిచేయడానికి ఒడిగట్టింది, ఇక్కడ చాలామంది నెటిజన్లు ఫ్రీగా చేస్తారు కదా, దానికి జీతాలు ఇచ్చి ఉద్యోగులను పెట్టుకోవాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా విష్ణు నటించిన చిత్రం జిన్నా. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించగా, పాయల్ రాజ్‌పుత్, బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్టు ప్రెస్‌మీట్ లో తెలిపాడు విష్ణు. అక్టోబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…