Manchi Rojulochaie Review : మంచి రోజులొచ్చాయి మూవీ కోసం చిత్ర యూనిట్ ఇటీవలి కాలంలో అనేక ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. చిత్ర దర్శకుడు మారుతి, హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాలు ఇటీవల బిగ్‌బాస్‌లోనూ కనిపించి సందడి చేశారు. ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!
గోపాల్ తిరుమలశెట్టి (అజయ్ ఘోష్)కు కూతురు పద్మ (మెహ్రీన్) అంటే ప్రాణం. ఆమెను ఎప్పుడూ భద్రంగా చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో సంతు (సంతోష్ శోభన్), పద్మ డీప్ గా లవ్‌లో మునిగి తేలుతుంటారు. అయితే ఈ విషయం గోపాల్‌కు అతని స్నేహితుల ద్వారా తెలుస్తుంది. వారు అతన్ని భయపెడతారు. నీ కూతరు వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది, జాగ్రత్త.. అని హెచ్చరిస్తారు. దీంతో గోపాల్ అప్ సెట్ అయి కుమార్తె పట్ల మరింత కేర్ తీసుకుంటుంటాడు. అయితే తన మామను సంతు ఎలా మేనేజ్ చేశాడు, ఆయన ఆశీర్వాదాలు లభించాయా ? తన లవ్‌ను సక్సెస్ చేసుకున్నాడా ? అన్న విషయాలు తెలియాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
నిజ జీవితానికి సంబంధించిన పాయింట్లను తీసుకుని దర్శకుడు మారుతి సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. ఇక ఇందులోనూ అదే విధంగా ఓ పాయింట్ తీసుకున్నాడు. అది భయం. ఆడపిల్ల తండ్రికి సహజంగానే ఉండే భయాన్ని ఇందులో చూపించారు. దీంతోపాటు చక్కని కామెడీని కూడా వర్కవుట్ చేశారు. మెహ్రీన్, అజయ్ ఘోష్, సంతోష్ శోభన్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, వైవా హర్ష, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించి అలరించారు.
సినిమాను నిజానికి 2 గంటల్లోపే ముగించవచ్చు. కానీ 20 నిమిషాలను పొడిగించారు. దీంతో సినిమా కాస్త నెమ్మదిగా నడుస్తుందన్న భావన కలుగుతుంది. అలాగే కరోనా యాంగిల్‌ను సినిమాలో చొప్పించారు. కానీ అదంత పెద్ద ప్రభావాన్ని చూపించలేదనే చెప్పాలి. ఇక మూవీ క్లైమాక్స్ కూడా ముందుగా ఊహించినట్లే ఉంటుంది. పెద్ద ట్విస్టులు ఏమీ ఉండవు. అందువల్ల యావరేజ్ అన్న ఫీలింగ్ వస్తుంది.
అయితే ప్రొడక్షన్ విలువలు, మ్యూజిక్, డైలాగ్‌లు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. దర్శకుడు మారుతి సహజంగానే కామెడీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో సినిమాలు తీస్తారు. కనుక కామెడీని, చక్కని వినోదాన్ని కోరుకునే వారు ఈ మూవీని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఆ జోనర్‌లు అంటే ఇష్టపడే వారు కచ్చితంగా ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. వీకెండ్‌లో సరదాగా ఈ మూవీని చూసి నవ్వుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…