Malavika Mohanan : సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు అందులో చేసే అందాల ప్రదర్శనకు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఈమె సినిమాల్లోకి రాక ముందు మోడల్ కావడంతో ఆమె స్వతహాగానే అధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉంది. అందులో భాగంగానే తరచూ ఈమె ఫొటోషూట్స్ చేస్తుంటుంది. అలాగే మ్యాగజైన్ల కవర్ ఫొటోలకు పోజులు ఇస్తుంటుంది. అయితే మాళవిక మోహనన్‌పై ఓ నెటిజన్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే అందుకు ఆమె దీటుగా రిప్లై ఇచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మాళవిక మోహనన్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో ఓ వ్యక్తి అసభ్యమైన కామెంట్ పెట్టాడు. నువ్వు కేవలం గ్లామర్ ఫొటోషూట్స్ మాత్రమే చేసి ఫాలోవర్లను సంపాదించుకుంటున్నావు, నీకు అసలు యాక్టింగ్ రాదు, నీకు టాలెంట్ లేదు, జీరో టాలెంటెడ్ పర్సన్‌వి నువ్వు, కేవలం అందాల ఆరబోతతోనే నువ్వు పాపులర్ అయ్యావు, ఆ పని చేసేందుకే నువ్వు పనికొస్తావు, సినిమాలకు పనికిరావు.. అని ఓ నెటిజన్ ఆమెకు ట్వీట్ చేశాడు. అయితే దీనికి మాళవిక మోహనన్ స్ట్రాంగ్‌గా బదులిచ్చింది.
అయితే నువ్వు మరి నా ఫొటోషూట్స్ కోసం నన్ను ఫాలో అవుతున్నావా.. లేక ట్విట్టర్‌లోనే నన్ను ఫాలో అవుతున్నావా.. అంటూ ఆమె దీటుగా సమాధానం చెప్పి ఆ నెటిజన్ నోరు మూయించింది. ఇక మాళవిక మోహనన్ ఓ వైపు గ్లామర్ ఫొటోషూట్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో బిజీగా మారింది. ఈమె విజయ్‌తో కలిసి నటించిన మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే తరువాత ధనుష్‌తో కలిసి చేసిన మారన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఈమె ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి యుధ్ర అనే హిందీ మూవీలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ మూవీలో నటించే అవకాశం వచ్చిందని అంటున్నారు. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…