Malavika Mohanan : మోడల్ అయినప్పటికీ నటనతో మాళవిక మోహనన్ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. అప్పుడప్పుడు ఈ భామ ఫొటోషూట్‌లు చేస్తూ అలరిస్తుంటుంది. ఇక ఫ్యాషన్ షోలలోనూ పాల్గొంటుంది. వాటిల్లో ఆమె తన అందాలను ఆరబోస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మాళవిక మోహనన్ తాను చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అవి యువకుల మతులను పోగొడుతున్నాయి.
వార్దా అహ్మద్ అనే డిజైనర్ డిజైన్ చేసిన ధోతి, టాప్ దుస్తులను మాళవిక మోహనన్ ధరించింది. అందులో ఆమె స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తుండడం విశేషం. ఇక ఆ పోస్ట్ కింద ఆమె కామెంట్‌ను కూడా పెట్టింది. ఊర్వశి.. ఫ్రమ్ ఎ ఫార్ ఎవే టైమ్ ఇన్ ఎ ఫార్ ఎవే ల్యాండ్.. అని ఆమె క్యాప్షన్ పెట్టింది.
కాగా మాళవిక మోహనన్ కు చెందిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈమె తమిళంలో విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించి మంచి మార్కులు తెచ్చుకుంది.
https://www.instagram.com/p/CUsO1FCvXYE/?utm_source=ig_embed&ig_rid=5e430a57-4c4f-435c-9e11-474c3af86090&ig_mid=86B755C6-F5E7-4D2B-B682-57D1A4D9DB71