Maheshwari : ఒకప్పుడు హీరోయిన్ మహేశ్వరి నటిగా ఎంతటి పేరును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఓ దశలో టాప్ రేంజ్‌కు కూడా చేరుకుంది. అయితే అందరు హీరోయిన్లలాగే ఈమె కూడా కొంతకాలానికి తెరమరుగు అయిపోయింది. ఇక తాజాగా ఈమె మరోమారు తెరపై కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒకప్పుడు ఎంతో గ్లామర్‌గా ఉన్న మహేశ్వరి ఇప్పుడు మాత్రం బాగా లావుగా అయి దర్శనమిస్తోంది. అయితే తాజాగా అలీతో షోలో పాల్గొన్న మహేశ్వరి తన సినీ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలియజేసింది.
అప్పట్లో జేడీ చక్రవర్తి హీరోగా, మహేశ్వరి హీరోయిన్‌గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన దెయ్యం మూవీ ఎంతటి హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి మహేశ్వరి తెలియజేసింది.
అప్పట్లో దెయ్యం మూవీ షూటింగ్ మేడ్చల్‌లోని ఓ పాడుబడిన బిల్డింగ్‌లో జరిగింది. షూటింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా శ్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. షూటింగ్ రాత్రి 1 గంటకు జరుగుతోంది.
అయితే షూటింగ్ లొకేషన్ నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి మెయిన్ రోడ్డుకు చేరుకుని తిరిగి వెనక్కి రావాలి. ఇదీ పందెం. అలా వెళ్లి వచ్చిన వారికి రూ.50వేలు ఇస్తానని వర్మ చెప్పారు. ఈ క్రమంలో చాలెంజ్ స్వీకరించిన మహేశ్వరి భయపడుతూనే అలా వెళ్లి వచ్చిందట. అయినప్పటికీ వర్మ తాను చెప్పినట్లు రూ.50వేలు ఇవ్వలేదట. ఇదే విషయాన్ని ఆమె తాజాగా చెబుతూ వర్మ అలా తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…