Mahesh Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్‌తో సినిమా నిర్మించడానికి నిర్మాత కె.ఎల్. నారాయణ ప్లాన్ చేశారు. ఇన్నాళ్లకు కానీ అది వాస్తవరూపం దాల్చడం లేదు. ఈ చిత్రం పలు కారణాలు.. వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే రాజమౌళితో మూవీ స్టార్ట్ చేస్తాడు మహేష్. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట.
దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక ఇది అలా ఉంటే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టెంట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా నిజ జీవిత సంఘటన ఆధారంగా వస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ బాలీవుడ్ మీడియాతో తెలిపినట్లు టాక్.
మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ లాస్ ఏంజెల్స్‌కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చున్నారట. ఈ సంస్థ కాస్టింగ్‌తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి సేవలను అందిస్తుంది. ఇలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి తన సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చినట్టు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…