Pooja Hegde : సెప్టెంబర్ 28న హీరో మహేష్ బాబు తల్లి మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో అలాగే మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొని ఉంది. ఎంతో మంది నటులు, సెలబ్రటీలు, రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా ఇంకా సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు అమ్మ గారికి నివాళులు అర్పించారు.
అంతే కాకుండా ఈ మధ్యే సర్కారు వారి పాట సినిమాలో హహేష్ బాబు సరసన నటించిన కీర్తి సురేష్ కూడా త్వరగా స్పదించి తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ స్వయంగా వచ్చి తన సంతాపాన్ని తెలియజేసింది. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డె మాత్రం చాలా ఆలస్యంగా అసలు ఏమీ జరగనట్టు సోషల్ మీడియా పోస్టు ద్వారా స్పదించడంతో మహేష్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పోస్టులో తను మహేష్ బాబుని ఏక వచనంతో సంబోధించడం కూడా మహేష్ అభిమానులకు నచ్చక పోవడంతో ఆమెని దూషించడం మొదలు పెట్టారు.
అదే సందర్భంలో తన ఇన్‌స్టాగ్రామ్ లో గ్లామరస్ గా ఉన్న ఫోటోలు కూడా పోస్టు చేయడంతోపాటు కొన్ని ఈవెంట్లలో కూడా పాల్గొన్నట్టు తెలిసింది. దీంతో మహేష్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డెను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. తనకు ఇంత అహంకారం, పొగరు ఉండకూడదని పోస్టులు పెడుతూ తమ కోపాన్ని తెలియజేస్తున్నారు.
అయితే కొంత మంది మాత్రం అభిమానులు ఇలా చేయడం సరికాదని హితభోద చేస్తున్నారు. ఒకవేళ పూజా మహేష్ బాబుకి వ్యక్తి గతంగా తన సానుభూతిని తెలియజేసి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు. కానీ అభిమానులు పూజాను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారనేది మాత్రం వాస్తవం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…