Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ శీతల పానీయం థమ్స్ అప్‌కు ఎంతో కాలంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం విదితమే. గత దశాబ్ద కాలం నుంచి ఆయన ఆ కూల్ డ్రింక్‌ను ప్రమోట్ చేస్తున్నారు. థమ్స్ అప్‌కు చెందిన ఎన్నో యాడ్స్‌లో ఇప్పటికే మహేష్ నటించారు. అయితే ఎట్టకేలకు ఆ సంస్థతో మహేష్ తెగదెంపులు చేసుకున్నారు.
థమ్స్ అప్ మాతృ సంస్థ అయిన కోకాకోలాతో గతంలో మహేష్ ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కోకాకోలాతో అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. అయితే వెంటనే ఆయన పెప్సీ కో. తో డీల్ కుదుర్చుకోవడం విశేషం. ఈ క్రమంలోనే మహేష్ ఇకపై పెప్సీ కో. కు చెందిన మౌంటెయిన్ డ్యూ అనే శీతల పానీయానికి ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.
మహేష్ ఇటీవలే అమెరికాకు వెళ్లగా.. అంతకు ముందే ఈ డీల్ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వివరాలను అధికారికంగా ప్రకటించారు. దీంతో థమ్స్ అప్‌కు ఇకపై మహేష్ కనిపించరు. మౌంటెయిన్ డ్యూ యాడ్‌లో మహేష్ కనిపించనున్నారు. ఆ యాడ్ ఎలా ఉంటుందోనని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక థమ్స్ అప్ విషయానికి వస్తే ఆ సంస్థ తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పాపులర్ యూత్ హీరోను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు ఆ చాన్స్ వస్తుందని అంటున్నారు.
కాగా విజయ్ ప్రస్తుతం లైగర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ మూవీ విడుదల కానుంది. మరోవైపు మహేష్ తన తదుపరి చిత్రం సర్కారు వారి పాటలో కనిపించనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడు. అనంతరం రాజమౌళితో సినిమాను ప్రారంభిస్తారు.