Mahendra Singh Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ జోరు మీద ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై నిరాశ పరిచినా ఇప్పుడు మాత్రం చెన్నై అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. అయితే తాను 2022.. అంటే వచ్చే ఐపీఎల్ లో ఆడుతానని ధోనీ హింట్ ఇచ్చాడు. ఇక చెన్నై స్టేడియంలో వీడ్కోలు మ్యాచ్ ఉంటుందని సూచన ప్రాయంగా తెలిపాడు. అంటే వచ్చే ఐపీఎల్ ధోనీకి ఇక ఆఖరిదన్నమాట.
2022 ఐపీఎల్‌లో తాను ఆడుతానని ధోనీ హింట్ ఇచ్చాడు కనుక చెన్నై యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అంతకు ముందు వరకు టీమ్ మేనేజ్‌మెంట్ సందిగ్ధంలో ఉంది. ధోనీ వచ్చే ఐపీఎల్ ఆడకపోతే వేలంలో ఎవరిని తీసుకోవాలా ? అని ఇప్పటి నుంచే మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. అయితే ధోనీ తాను వచ్చే ఒక్క ఐపీఎల్ ఆడుతానని స్పష్టం చేయడంతో.. టీమ్ మేనేజ్‌మెంట్ హమ్మయ్య అని సంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్‌లో చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొత్తం 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై 9 మ్యాచ్‌లలో గెలిచింది. 4 మ్యాచ్‌లలో ఓడింది. 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 20 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.