Maha Shivaratri 2022 : మ‌హా శివ‌రాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ ఎందుకు చేయాలో తెలుసా ?

Maha Shivaratri 2022 : మ‌హా శివ‌రాత్రి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే శివాల‌యాలు శివ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ఆ రోజు భ‌క్తులు శివుడికి అనేక పూజ‌లు చేస్తుంటారు. లింగం రూపంలో ఉండే ఆయ‌న్ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు, అభిషేకాలు చేస్తుంటారు. అయితే మ‌హా శివ‌రాత్రి రోజు భ‌క్తులు క‌చ్చితంగా ఉప‌వాసం ఉంటారు. అలాగే రాత్రంతా జాగ‌ర‌ణ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? ఇలా చేస్తే ఏం జ‌రుగుతుంది ? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Maha Shivaratri 2022

మ‌హా శివ‌రాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ ఎందుకు చేయాలి ? అని చెప్పేందుకు ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది. దాని ప్ర‌కారం.. పూర్వం ఒక బోయ‌వాడు ఉండేవాడు. అత‌ని పేరు సుస్వ‌రుడు. అత‌ను రోజూ అడ‌విలో జంతువుల‌ను వేటాడి సాయంత్రం వాటి మాంసాన్ని విక్ర‌యించి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే ఒక రోజు అత‌ను అడ‌విలో ఎంత తిరిగినా అత‌నికి ఒక్క జంతువు కూడా క‌నిపించ‌దు. అలా అత‌ను తిరుగుతూనే ఉంటాడు. మ‌రోవైపు ఆక‌లి అవుతున్నా, దాహం అవుతున్నా.. ప‌ట్టించుకోకుండా వేట కొన‌సాగిస్తుంటాడు. కానీ ఒక్క జంతువు కూడా క‌నిపించ‌దు. ఈ క్ర‌మంలోనే రాత్రి అవుతుంది.

దీంతో త‌న దుర‌దృష్టానికి అత‌ను చింతిస్తూ.. అక్క‌డే ఉన్న ఒక బిల్వ వృక్షంపైకి ఎక్కి ఆ చెట్టు ఆకుల‌ను ఒక్కొక్క‌టిగా తెంపి కింద‌కు వేస్తూ కాల‌క్షేపం చేస్తుంటాడు. అయితే వాస్త‌వానికి ఆ రోజు మ‌హాశివ‌రాత్రి. ఆ విషయం సుస్వ‌రుడికి తెలియ‌దు. ఆ రోజంతా ఏమీ తిన‌కుండా, తాగ‌కుండా అత‌ను ఉప‌వాసం ఉన్నాడు. అలా అత‌ని ఉప‌వాస దీక్ష జ‌రిగింది. ఇక రాత్రంతా చెట్టు మీద ఉండి జాగ‌ర‌ణ చేశాడు. దీంతో జాగ‌ర‌ణ కూడా పూర్త‌యింది. త‌న‌కు తెలియ‌కుండానే బిల్వ వృక్షం ఆకుల‌ను తెంపి కింద ఉన్న శివ లింగం మీద వేశాడు. దీంతో శివ పూజ కూడా పూర్త‌యింది. ఇవ‌న్నీ అత‌నికి తెలియ‌కుండానే జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల‌కు అత‌ను మ‌ర‌ణించాడు. త‌రువాత అత‌నికి ఎంతో పుణ్య ఫ‌లం ల‌భించింది. అత‌ను నేరుగా కైలాసానికి వెళ్లాడు. మ‌రుస‌టి జ‌న్మ‌ను పొంద‌లేదు. అదీ.. శివ‌రాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ దీక్ష చేయ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం.

మ‌హా శివ‌రాత్రి రోజు ఆ విధంగా ఎవ‌రైనా స‌రే ఉప‌వాసం ఉండి, జాగ‌ర‌ణ దీక్ష చేసి శివున్ని ఆరాధిస్తే వారికి అమిత‌మైన పుణ్య ఫ‌లితం ల‌భిస్తుంది. వారు చ‌నిపోయాక నేరుగా కైలాసానికి చేరుకుంటారు. వారికి మ‌రో జ‌న్మ ఉండ‌దు. అందుక‌నే శివ‌రాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ దీక్ష‌ల‌ను చేయాల‌ని చెబుతుంటారు. ఇదీ.. వాటిని ఆచ‌రించ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం..!

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM