రోజులు గడుస్తున్న కొద్దీ మూ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రచారానికి కేవలం 1 రోజు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. అయితే ఎన్నికలు ఏమో గానీ.. అటు మెగా ఫ్యామిలీ, ఇటు మోహన్ బాబు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తమ మధ్య గొడవలు లేవంటూనే.. సినీ ఇండస్ట్రీల్లో వర్గాలు ఉన్నాయని వారు చెప్పకనే చెప్పినట్లు అవుతోంది.
గతంలో ఒకసారి చిరంజీవి, మోహన్‌బాబుల మధ్య గొడవలు ఉన్నాయని, ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ ఇద్దరూ కలసి ఒకే స్టేజిపై కనిపించి అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమేనని, ఎవరో అనే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే అంత వరకు బాగానే ఉన్నా.. వారు స్నేహితులు అయితే ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు ? అందరూ కలసి ఒకే వ్యక్తిని మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు కదా ? అన్నది అసలు ప్రశ్న.
సినీ ఇండస్ట్రీలో వివాదాలు కొత్తేమీ కావు. అప్పుడప్పుడూ అందులో ఉండే లుకలుకలు బయటకు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వైరం మరోసారి బట్ట బయలైందని టాక్ నడుస్తోంది. ఈ రెండు ఫ్యామిలీలు నిజంగానే స్నేహితులు అయితే అందరూ కలసి కూర్చుని మాట్లాడుకుని ఒకరినే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు కదా.. అలా చేయడం లేదు.. అంటే వైరం ఉన్నట్లేగా.. అని చర్చించుకుంటున్నారు.
అయితే ఈ వైరం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అవుతుందా ? గెలుపు ఓటముల తరువాత ఇరు కుటుంబాలు సఖ్యతగా ఉంటాయా ? లేక ఇప్పుడు ఉన్నట్లుగానే వాతావరణం ఉంటుందా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…