Love Story : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీలో నాగచైతన్య, సాయిపల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీకి గాను చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగచైతన్య, సాయిపల్లవిలు ఈ మూవీ గురించి తమ అనుభవాలను పంచుకున్నారు.
లవ్ స్టోరీ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ.. తాను శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకున్నానని అన్నారు. అయితే ప్రస్తుతం సినిమా విడుదల అయింది కనుక ఇక ఆయనతో ప్రయాణం చేయలేనని, అందుకు బాధగా ఉందని అన్నారు. అయినప్పటికీ మళ్లీ కలసి పనిచేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.
ఇక తన సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తాను స్వయంగా తెలుసుకుంటానని, తన సినిమాపై విమర్శకులు ఏమంటున్నారోనని తెలుసుకుంటానని తెలిపాడు. కరోనా వల్ల ఇలాంటి విషయాలు తెలుసుకోలేకపోయానని, అయినప్పటికీ ఇప్పుడు ఆ అవకాశం లభించిందన్నారు. లవ్ స్టోరీ విడుదల కావడంతో ఎంతో ఆనంద పడ్డానని తెలిపారు. థియేటర్‌కు వచ్చి సినిమా చూసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని, సినిమా విడుదలతో తమ ఇద్దరి ప్రయాణం ఆగిపోతుందని బాధ కలుగుతుందని అన్నారు.
అనంతరం సాయిపల్లవి మాట్లాడుతూ.. చిత్ర బృందం సమిష్టిగా కృషి చేయడం వల్లే మూవీ అద్భుతంగా వచ్చి హిట్ అయిందన్నారు. అందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మూవీ విడుదలపై ఆందోళన చెందానని, ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఖంగారు పడ్డానని అన్నారు. అయితే సినిమా హిట్ కావడంతో సంతోషంగా ఉందన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…