Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిచిన చిత్రం ‘లవ్ స్టోరీ’ . సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. స్టార్ మా లో ప్రసారం అయిన ఈ చిత్రానికి తొలిసారి సాలిడ్ టీఆర్పీని రాబట్టింది.
ఈ చిత్రం తొలిసారిగా 18.01 టీఆర్పీని రాబట్టి బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టడం విశేషం. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. అమెరికాలో 224 లొకేషన్స్‌లో లవ్‌స్టోరీ ప్రీమియర్స్ వేస్తే, 3,07,103 డాలర్స్ వసూలు చేసింది.
లవ్ స్టోరీ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా చైతూ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగ రాయ్ విడుదలైంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…