Looop Lapeta Movie Review : వైవిధ్యభరితమైన చిత్రాలలో నటించడంలో నటి తాప్సీ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఆమె కమర్షియల్ సినిమాలను చేయడం ఎప్పుడో మానేసింది. మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో ఆమె సక్సెస్ ను కూడా సాధిస్తోంది. ఇక తాప్సీ హీరోయిన్‌గా వచ్చిన తాజా మూవీ.. లూప్ లపేటా. ఈ మూవీ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..
సవి (తాప్సీ) తన బాయ్ ఫ్రెండ్‌ను రక్షించుకునేందుకు ఇబ్బందుల్లో పడుతుంది. అందుకు గాను ఆమె టైమ్‌తో పోటీ పడాల్సి వస్తుంటుంది. ఆమెకు 80 నిమిషాల సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆమె చనిపోతూ బతుకుతూ ఉంటుంది. అంటే.. ఆమెకు ఆ సంఘటనలు టైమ్ లూప్‌లో జరుగుతుంటాయన్నమాట. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ సత్య (తాహిర్ రాజ్ భాసిన్)ను రక్షించుకునేందుకు ఆమె పెద్ద మొత్తంలో డబ్బును ఓ వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. టైమ్ దాటిపోతే చనిపోతాడు. ఇదీ.. కథ.. ఇక ఇందులో సవి ఏం చేసింది ? తన బాయ్ ఫ్రెండ్‌ను ఎలా రక్షించుకుంది ? అన్న వివరాలు తెలుసుకోవాలంటే.. సినిమాను చూడాల్సిందే.
హాలీవుడ్‌లో ఇప్పటికే చాలా టైమ్ లూప్ మూవీస్ ఉంటాయి. అంటే ఒక సీక్వెన్స్‌లో వెళ్తుండగా.. ఒక దశలో ప్రధాన పాత్ర చనిపోతుంది. మళ్లీ బతుకుతుంది. అలా సీక్వెన్స్ కొనసాగుతుంది. అందులో కథను బట్టి ఆ పాత్ర ఒక పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే ఇతివృత్తాన్ని ఇందులోనూ తీసుకున్నారు. హాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన టైమ్ లూప్ మూవీలన్నీ విజయం సాధించాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్కంఠ కలిగించే సీన్లు ఉంటే ఇలాంటి చిత్రాలు తప్పక విజయం సాధిస్తాయి. అందుకనే తాప్సీ ఈ చిత్రాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతుంది.
ఇక తాప్సీ నటనకు పేరుపెట్టాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్య భరితమైన చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది. ఈ మూవీలోనూ ఆమె నటన ఆకట్టుకుంటుంది. పలు చోట్ల హాస్య భరితమైన సన్నివేశాలు ప్రేక్షకులకు విపరీతమైన నవ్వు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా చూస్తే మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. జర్మనీలో వచ్చిన రన్ లోలా రన్ అనే మూవీ ఆధారంగా లూప్ లపేటాను తెరకెక్కించారు. ప్రేక్షకులు ఈ వీకెండ్‌లో ఈ మూవీని కచ్చితంగా ఒకసారి చూడవచ్చు.