Liger : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఇందులో అంతర్జాతీయ బాక్సింగ్ ఆటగాడు మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయనకు భారీ మొత్తంలో నిర్మాతలు ముట్టజెబుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే మైక్ టైసన్ పాత్రకు గాను నందమూరి బాలకృష్ణతో డబ్బింగ్ చెప్పిస్తారని వార్తలు జోరుగా వస్తున్నాయి.
కాగా ఈ వార్తల నేపథ్యంలో లైగర్ చిత్ర యూనిట్ స్పందించింది. మైక్ టైసన్ పాత్రకు బాలయ్య బాబుతో డబ్బింగ్ చెప్పిస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసలు టైసన్ గొంతు వేరే అని అందుకు బాలయ్య గొంతు సెట్ అవ్వదని, అందుకు వేరే ఏర్పాట్లు చేస్తున్నామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.
ఇక లైగర్ మూవీలో విజయ్ దేవర కొండ సరసన అనన్య పాండే ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ మూవీ కొనసాగుతుందని తెలుస్తోంది.