Liger : సాధారణంగా ఏ మూవీ అయినా సరే హీరోకు ఎక్కువ పారితోషికం ఉంటుంది. తరువాత హీరోయిన్‌కు, ఆ తరువాత మిగిలిన ఆర్టిస్టులకు వారి ప్రఖ్యాతిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ మూవీలో ఆయనకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కి అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మైక్ టైసన్ ఈ చిత్రంలో కొంత సమయంలో నటిస్తున్నప్పటికీ ఈయనకి ఉన్న డిమాండ్ ఆధారంగా ఆయనకి హీరో కన్నా అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.