Happy Birth Day Movie : లావణ్య త్రిపాఠికి ఈమధ్య కాలంలో అసలు ఆఫర్లు లేవనే చెప్పాలి. అయినప్పటికీ ఎప్పుడో ఒక చిత్రంతో ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. కానీ విజయాలు మాత్రం లభించడం లేదు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా హ్యాపీ బర్త్ డే అనే మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. కనీసం దీంతో అయినా ఈమె హిట్ కొట్టిందా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
రక్షణ శాఖ మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్) దేశంలో తుపాకుల పట్ల ఉండే చట్టాలను సవరిస్తాడు. దీంతో గన్‌ల వాడకం ఎక్కువవుతుంది. ప్రతి ఒక్కరూ గన్‌ను కొని వాడడం మొదలు పెడతారు. ఇక హైదరాబాద్‌లోని రిట్జ్ హోటల్‌లో హౌస్ కీపర్ (నరేష్ అగస్త్య) ని హోటల్‌లో ఉండే లైటర్ స్థానంలో పెట్టేందుకు యత్నిస్తారు. ఇక అక్కడే జరిగే ఓ బర్త్ డే పార్టీకి హ్యాపీ (లావణ్య త్రిపాఠి) హాజరవుతుంది. ఈ క్రమంలోనే ఆమె కిడ్నాప్‌కు గురవుతుంది. అయితే ఆమెను ఎవరు కిడ్నాప్ చేస్తారు ? ఆమె కథేమిటి ? చివరకు ఏం జరుగుతుంది ? కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
మత్తు వదలరా సినిమా దర్శకుడు రితేష్ రాణా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలో అప్పట్లో ఆ మూవీ హిట్ అయింది. ఇక ఆ సినిమాలోని కొన్ని పాత్రలను కూడా ఇప్పటి మూవీలో చూపించారు. ఈ క్రమంలోనే సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా కొనసాగుతుంది. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే ఓవరాల్‌గా చూస్తే మాత్రం సినిమా కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఈ మూవీలో కామెడీ, ప్రొడక్షన్ విలువలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే హీరోయిన్ పాత్రను చిత్రీకరించిన విధానం, బోరింగ్ గా సాగే సీన్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి. ఇవన్నీ ఫర్లేదు చూడొచ్చు.. అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. లేదంటే దీనికి దూరంగా ఉండడమే బెటర్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…