Lavanya Tripathi : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో సెలబ్రిటీలకు చెందినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రాగా అవి తరువాత నిజమయ్యాయి. ఇక నరేష్, పవిత్ర లోకేష్‌లు సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే సహజీవనం చేస్తున్నమాట నిజమే అయ్యింది కానీ పెళ్లి వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలా సెలబ్రిటీలకు సంబంధించి అనేక వార్తలు ముందుగానే వైరల్ అవుతున్నాయి. కానీ అవే తరువాత నిజం అవుతుండడం విశేషం. ఇక ఇలాంటి వార్తే గతంలో బాగా వైరల్ అయింది. అదేమిటంటే..
అప్పట్లో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. లావణ్యకు వరుణ్ డైమండ్ రింగ్‌ను ఇచ్చి ప్రపోజ్ చేశాడని.. ఇందుకు లావణ్య కూడా ఓకే చెప్పిందని.. నాగబాబు కూడా అడ్డు చెప్పలేదని.. కనుక వీరి పెళ్లి ఖాయమైపోయిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపై లావణ్య లేదా వరుణ్, నాగబాబు ఎవరూ స్పందించలేదు. ఆ వార్తలను ఖండించలేదు. దీంతో ఆ వార్తలను నిజమే అని నమ్మారు. కానీ ఆ రూమర్స్‌కు లావణ్య తాజాగా చెక్ పెట్టింది. తనకు, వరుణ్‌కు పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. ఇంతకీ ఆమె చెప్పిందంటే..

తనకు, వరుణ్‌కు పెళ్లి అన్నవార్తలపై తాను నిజంగా షాక్‌కు గురయ్యానని లావణ్య త్రిపాఠి తెలియజేసింది. పొద్దున పెళ్లి, సాయంత్రం రిసెప్షన్.. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది.. అంటూ వచ్చిన వార్తలపై తాను నిజంగానే ఆశ్చర్యపోయానని ఆమె చెప్పింది. తాను, నిహారిక మంచి ఫ్రెండ్స్ అని.. అంతకు మించి తనకు, వరుణ్‌కు మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇక తన వేలికి ఉన్న రింగ్‌ను తానే కొనుక్కున్నానని.. అది వరుణ్ ఇచ్చింది కాదని కూడా చెప్పింది. దీంతో వీరి పెళ్లి రూమర్స్‌కు తెర పడినట్లు అయింది.
ఇక లావణ్య త్రిపాఠి లేటెస్ట్‌గా నటించిన హ్యాపీ బర్త్ డే మూవీ ఈ నెల 8వ తేదీన రిలీజ్ కానుండగా.. లావణ్య ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పై విధంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించి రిప్లై ఇచ్చింది.