Dasari and chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించుకున్నారు. అయితే హీరో అన్న తర్వాత సక్సెస్ తో పాటు ఫ్లాప్ లను కూడా చవిచూడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అలాంటి సినిమాలు చిరంజీవి ఖాతాలో కూడా కొన్ని ఉన్నాయి.
అప్పట్లో వడ్డే రమేష్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా లంకేశ్వరుడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా రాధ నటించారు. ఈ సినిమాకు దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. మొదట దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన శివరంజని సినిమాలో చిరంజీవిని హీరోగా అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారట. దానితో చిరు, దాసరి కాంబినేషన్ లంకేశ్వరుడు చిత్రం పట్టాలెక్కింది.
1988 నవంబర్ నెలలో లంకేశ్వరుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ, నట భూషణ్ శోభన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి దాసరిలకు మధ్య కొన్ని గొడవలు జరిగాయట. దాసరి నారాయణరావు ఆ సమయం లో స్టార్ డైరెక్టర్ కాగా చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో దాసరి నారాయణరావు లేకుండానే చిరంజీవి సినిమాలోని రెండు పాటలు మినహా అన్ని పాటలను చిత్రించారు. దీనిబట్టి వీరిద్దరి మధ్య ఏ రేంజ్ లో మనస్పర్ధలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత నిర్మాత వడ్డే రమేష్ ఇద్దరిని చాలా ప్రయత్నాలు చేసి కలిపి షూటింగ్ పనులు పూర్తి చేయించారట. అలా లంకేశ్వరుడు సినిమా పూర్తి అయిన తర్వాత అప్పట్లో ఈ చిత్రాన్ని భారీ రేటుకు అమ్మడం జరిగిందట. అలా 1989లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
లంకేశ్వరుడు చిత్రం అలా ఫ్లాప్ టాక్ ని మూట కట్టుకోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా కథాంశం బాగా లేకపోవడం సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అయింది. చాలా సన్నివేశాలలో సహజత్వం లేకపోవడం వలన థియేటర్లకి వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో చిరంజీవి భారీగా డైలాగులు చెప్పడం అభిమానులకు సైతం నచ్చలేదు. సినిమాలో చిరంజీవి వెంట ఓ చిరుత పులి కూడా ఉంటుంది. కాని దానితో పెద్దగా సన్నివేశాలు ఉండకపోగా దానిని చంపేయడం సైతం ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది. అలా భారీ అంచనాలతో విడుదలైన లంకేశ్వరుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…